
సిరి మువ్వకి మౌనం లేదు
చిరు గాలికి అలసట లేదు
కిరణానికి చీకటి లేదు
చిరునవ్వుకి మరణం లేదు..
siri muvvaki mounam ledu
chiru galiki alasata ledu
kirananiki cheekati ledu
chirunavvu ki maranam ledu…
కల కన్నా అందమైనది ఊహ
ఊహ కన్నా అందమైనది నీ పరిచయం
దానికన్నా అందమైంది మన స్నేహం..
వీడిపోని వీడలేని అక్షర బంధం…
kala kanna andamainadi ooha
ooha kanna andamainadi nee parichayam
danikanna andamaindi mana sneham..
veediponi veedaleni akshara bandham…
నీ పరిచయం దివ్య కావ్యం
నీ స్నేహం సుందర స్వప్నం
పెదవి దాటని ప్రేమ భావం
ఎన్నో యుగాల బంధం
విడదీయలేని అనుభందం…
nee parichayam divya kaavyam
nee sneham sundara swapnam
pedavi daatani prema bhaavam
enno yugala bandham
vidadeeyaleni anubhandam…
ఆలపించని మధుర గేయం
మానిపోని తీపి గాయం
కనిపించని విరహ వేదన
వినిపించని మూగ రోదన…
aalapinchani madhura geyam
maaniponi theepi gaayam
kanipinchani viraha vedana
vinipinchani mooga rodana….
నింగిలోని తారలా
నా హృదయ స్పందనల
ప్రతి క్షణం అనుక్షణం నీకై జీవిస్తూ
నీకై ఎదురు చూస్తూ వుంటా వేయి కళ్ళతో…
ningi lo ni thara la
naa hrudaya spandana la
prathi kshanam anukshanam neekai jeevisthu
NEEKAI eduru chustu vunta VEYI KALLATHO…